TG: మూసీని ప్రక్షాళన చేయకపోతే తన జన్మ ఎందుకు అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళన చేసి తీరుతానని.. ఎవరు అడ్డం పడతారో రావాలని సవాల్ విసిరారు. ఎవరు అడ్డుపడినా బుల్డోజర్తో తొక్కుకుంటూ పోతామని హెచ్చరించారు. రూ.లక్ష కోట్లు దోచుకున్న కేసీఆర్ కుటుంబం మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటోందని ఆరోపించారు. తన పదవి ఎవరి దయాదాక్షిణ్యం కాదని, ప్రజలు ఇచ్చిందని స్పష్టం చేశారు.