భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్కి ఇవాళ సుప్రీంకోర్టు వీడ్కోలు పలికింది. ఆయన ఈనెల 10న పదవీ విరమణ చేయనున్నారు. కానీ శని, ఆదివారాల్లో కోర్టుకు సెలవు దినాలు కావడంతో ఇవాళే వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో సీజే మాట్లాడుతూ.. రేపటి నుంచి ఉన్నత న్యాయస్థానంలో తీర్పులు ఇవ్వలేననేది నిజమైనా వృత్తిపరంగా తాను పూర్తి సంతృప్తిగా ఉన్నానన్నారు. కాగా తదుపరి సీజేగా సంజీవ్ ఖన్నా బాధ్యతలు చేపట్టనున్నారు.