బ్యాంక్ రుణ గ్రహీతలకు HDFC షాకిచ్చింది. ఎంపిక చేసిన రుణాలపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బెస్డ్ లెండింగ్ రేటుని 5 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో పర్సనల్ లోన్స్, వాహన రుణాలపై వడ్డీరేట్లు పెరగనున్నాయి. వడ్డీరేటు సుమారు 9.45 శాతానికి పెరగనుంది. ఒక్క రోజు లోన్స్ పై వడ్డీ 9.10 నుంచి 9.15 శాతం వరకు చేరుకోగా.. నెల కాలపరిమితితో తీసుకునే రుణాలపై వడ్డీ 9.20 శాతానికి చేరుకుంది.