నగరాల్లో ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే 2 గంటలుగా ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఓ వ్యక్తి అక్కడి నుంచే ఫుడ్ ఆర్డర్ పెట్టాడు. ఆ ఆర్డర్ కేవలం 10 నిమిషాల్లో వచ్చింది. ఈ ఘటన బెంగుళురులో చోటు చేసుకుంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఫుడ్ డెలివరీకి పీక్ ట్రాఫిక్ మాత్రం ఎలాంటి ఆటంకం కలిగించకపోవడం. ఈ విషయాన్ని ‘X’ వేదికగా పంచుకోగా ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.