WPL-2025 మెగా వేలానికి ముందు ఐదు ఫ్రాంఛైజీలు 24 మంది క్రికెటర్లను వదులుకున్నాయి. అన్ని ఫ్రాంఛైజీలు కలిపి 25 మంది విదేశీ, 46 మంది భారత ప్లేయర్లను రిటైన్ చేసుకున్నాయి. తెలుగు అమ్మాయిలు యషశ్రీ( యూపీ), త్రిష( గుజరాత్)లకు నిరాశ ఎదురైంది. పూనమ్ యాదవ్, స్నేహ్ రాణా, వేద కృష్ణమూర్తి వంటి అగ్రశ్రేణి క్రికెటర్లకు ఫ్రాంఛైజీలు మొండిచేయి చూపించాయి. కాగా WPL మెగా వేలం డిసెంబర్లో జరగనుంది.