ఇటీవల రీరిలీజ్ సినిమాల ట్రెండ్ కొనసాగుతోంది. బాలీవుడ్లో తుంబాద్ అనే చిన్న సినిమా రిలీజ్ కంటే రీరిలీజ్‌లో డబుల్ వసూళ్లు సాధించింది. నిధి కోసం సాగే ఈ హారర్ మూవీ దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌లో రీరిలీజ్ అయింది. ఈ మూవీ రిలీజ్లో రూ.16 కోట్లు కలెక్ట్ చేస్తే రీరిలీజ్‌లో ఏకంగా రూ.32 కోట్లు వసూలు చేసింది. దీంతో దేశంలో రీరిలీజ్ సినిమాల్లో అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది.