ఏలూరు: జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం గ్రామంలో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న నాటుసార తయారీ కేంద్రంపై పోలీసులు శుక్రవారం దాడి చేశారు. ఈ దాడిలో 20 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకొని రెండు వందల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని నాటు సారా తయారీకి ఉపయోగించే సామాన్లను స్వాధీనం చేసుకున్నారు.