ELR: మద్దతు ధరకే ప్రతి గింజా కొంటాం అని ప్రభుత్వం చెబుతున్న మాటలకు ఆచరణకు పొంతన లేదని.. దళారులు తేమ శాతం పేరుతో మద్దతు ధరలో రూ.325 లకు పైగా కోత పెట్టడం అన్యాయమని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. శుక్రవారం ఏపీ రైతు సంఘం- ఏపీ కౌలు రైతుల సంఘం నాయకులు ఉంగుటూరు మండలంలో పర్యటించారు.