పాఠశాల స్థాయి విద్యార్థుల కోసం లీడ్ గ్రూప్ టెక్బుక్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. పుస్తకాల స్థానంలో అగ్యుమెంటెడ్ రియాల్టీ ఆధారంగా పాఠ్యాంశాలను రూపొందించినట్లు ఆ సంస్థ CEO సుమిత్ మెహతా తెలిపారు. ఇందులో 1-8వ తరగతి CBSE సిలబస్ ఉంటుందని, పాఠాలను సులభంగా అర్థం చేసుకునేందుకు ఈ టెక్‌బుక్ సహకరిస్తుందని చెప్పారు. మూడేళ్లలో తెలుగు రాష్ట్రాల్లోని 500 స్కూల్స్‌తో కలిసి పనిచేయటం తమ లక్ష్యమని పేర్కొన్నారు.