కీవ్ సైన్యం చేతిలో కొందరు ఉత్తర కొరియా సైనికులు చనిపోయారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వెల్లడించారు. రష్యా తరఫున ఉక్రెయిన్పై పోరాడటానికి 11వేల మంది కిమ్ సైనికులు కుర్స్క్లో మోహరించారని గతంలోనే జెలెన్ స్కీ తెలిపారు. తాము కఠిన చర్యలు తీసుకోకపోతే అక్కడ మరిన్ని బలగాలను మోహరించే అవకాశముందని తాజాగా వ్యాఖ్యానించారు. యుద్ధం ముగియాలంటే ఉక్రెయిన్ తటస్థంగా ఉండాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ సూచించారు.