మహారాష్ట్రలో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో పార్టీలు ప్రచారంలో నిమగ్నమయ్యాయి. ఈ క్రమంలోనే ఎన్సీపీ (ఎస్పీ) అభ్యర్థి రాజసాహెబ్ దేశ్ ముఖ్ వినూత్న హామీ ఇచ్చారు. తనను గెలిపిస్తే పెళ్లి కాని అబ్బాయిలకు పెళ్లి చేయిస్తానని వెల్లడించారు. అమ్మాయిలను వెతకడంలో రూరల్ ప్రాంతాలకు చెందిన అబ్బాయిలు ఇబ్బందులు పడుతున్నారని, తాను గెలిస్తే అలాంటి వారికి పెళ్లిళ్లు చేయిస్తానని పేర్కొన్నారు.