కృష్ణా: ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీలు గురువారం చనుబండ చాట్రాయిలో నిర్వహించారు. ఈ ర్యాలీలో డిప్యూటీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ లక్ష్మీనారాయణ, మండల వైద్యఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ దుర్గా ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.