దేశంలో ఉగ్రవాద నిర్మూలనకు ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కేంద్రం పటిష్టమైన వ్యూహంతో ముందుకు సాగుతుందన్నారు. ఉగ్రవాదానికి ప్రాదేశిక సరిహద్దులు లేవని.. అందువల్ల అన్ని భద్రతా సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భద్రతా దళాలు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి సాంకేతికతను ఉపయోగించాలని ఆయన చెప్పారు.