KDP: రాజంపేట పట్టణంలో జిల్లాపరిషత్ బాలిక ఉన్నత పాఠశాలను గురువారం రాజంపేట పార్లమెంటు జనసేన సమన్వయకర్త యల్లటూరు శ్రీనివాస రాజు సందర్శించారు. ఈ సందర్భంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం ఏర్పాట్లను పర్యవేక్షించి, స్వయంగా ఆహార నాణ్యతను పరిశీలించారు. అలాగే పాఠశాల ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న భవనాలను వాటి ఏర్పాట్లను పర్యవేక్షించారు.