PPM: జియ్యమ్మవలస మండలం రావాడ రామభద్రపురం గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 7వతరగతి విద్యార్థి నిమ్మక జీవన్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పార్వతీపురం మన్యం డీఈవో ఎన్.తిరుపతి నాయుడు గురువారం ఆరా తీవారు. పాఠశాలను సందర్శించి సిబ్బందితో మాట్లాడి విద్యార్థి ఆరోగ్య విషయాలు, మృతికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టారు.