TG: BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫార్ములా 1 రేసింగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జైలుకు వెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. తనను జైల్లో పెట్టి రేవంత్ పైశాచిక ఆనందం పొందుతానంటే తాను రెడీ అని అన్నారు. 2, 3 నెలలు జైల్లో ఉంటే ఏమవుతుందని? ప్రశ్నించారు. కామన్వెల్త్ గేమ్స్ అంటేనే కాంగ్రెస్ స్కామ్ గుర్తుకొస్తుందని విమర్శించారు. ఒరిజినల్ కాస్ట్ కంటే 100 రెట్లకు పైగా కాంగ్రెస్ ఖర్చు చేసిందని ఆరోపించారు.