AP: విశాఖ స్టీల్ ప్లాంట్ను సీఎం చంద్రబాబు చౌకగా అమ్మే ప్రయత్నం చేస్తున్నారని సీఎం వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకున్నామని.. చంద్రబాబు చేతులెత్తేశారని ఎద్దేవా చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. విశాఖలో ఏర్పాటు చేసే ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాన్ని సీఎం విజయవాడకు తీసుకెళ్లారని మండిపడ్డారు.