TG: పత్తి సేకరణపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షించారు. రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లపై మార్కెటింగ్ శాఖాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో రోజువారీ పత్తి పంట వివరాలను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. కాగా, సీసీఐ కేంద్రాల్లో పత్తిని విక్రయించాలని రైతులకు మంత్రి తుమ్మల సూచించారు.