KMR: పాఠశాల విద్యార్థులు నేత్రాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, దోమకొండ మండల నేత్ర వైద్యాధికారి డాక్టర్ రవీందర్ చెప్పారు. గురువారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో విద్యార్థినిలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆహారంలో ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. అవసరమున్నవారికి మందులను పంపిణీ చేశారు.