E.G: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు పట్టణాలలో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాలలో మూడు సెంట్ల ఇళ్ల స్థలాలను వెంటనే పంపిణీ చేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ డిమాండ్ చేశారు. ఇళ్లస్థలాలు కేటాయించి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వాలని అన్నారు. ఉచిత ఇసుక విధానం పూర్తిగా విఫలమైందని ఆమె విమర్శించారు.