TG: అందోల్ నియోజకవర్గ జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో మంత్రి దామోదర రాజనరసింహ పర్యటించారు. నూతనంగా ప్రారంభమయ్యే BSC నర్సింగ్ కళాశాల ,150 పడకల ఆసుపత్రి నిర్మాణం, అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. అలాగే కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను కూడా పరిశీలించారు. ఆందోల్‌లోని గురుకుల పాఠశాలలో జరిగే జోనల్ లెవల్ స్పోర్ట్స్ మీట్‌కి ఏర్పాట్లు చేస్తున్న మైదానం, ఇతర అభివృద్ధి పనులను పర్యవేక్షించారు.