KDP: ఖద్దర్ మాట వినలేదని ఎస్పీ హర్షవర్ధన్ రాజును అర్ధాంతరంగా బదిలీ చేశారని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడుతూ.. ఎస్పీ వచ్చిన తర్వాత జిల్లాలో జూదం, ఇసుక అక్రమ రవాణాను అరికట్టారన్నారు. ఏడు నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు ఇసుక, జూదం, తమపై తప్పుడు కేసులు పెట్టేదానికి ఎస్పీ సహకరించడం లేదన్నారు.