TPT: గూడూరు మండలం కాండ్ర గ్రామ పరిధిలో గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రీ-సర్వే ప్రాజెక్టు క్రింద వచ్చిన భూ-సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని గూడూరు మండల తహసీల్దార్ ఎస్.చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. రీ-సర్వేలో ప్రజలకు ఏమైనా అభ్యంతరాలు, తప్పులు ఉన్నట్లయితే పరిష్కరించేందుకు కృషి చేస్తామని తహసీల్దార్ తెలిపారు.