TG: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్ అశోక్ నగర్లో ఓ అకాడమీ ప్రారంభోత్సవానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయన్ను కలిసేందుకు గ్రూప్-4 అభ్యర్థులు అశోక్ నగర్‌కు వచ్చారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎంకే తమ సమస్యలు చెప్పేందుకు నిరుద్యోగులు యత్నించారు. అయితే డిప్యూటీ సీఎంను కలిసేందుకు వచ్చిన నిరుద్యోగులను పోలీసులు అడ్డుకున్నారు. ప్రజాభవన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలని నిరుద్యోగ అభ్యర్థులకు సూచించారు.