AP: మాజీమంత్రి విడదల రజినిపై సోషల్ మీడియాలో చాలా దుర్మార్గమైన పోస్టులు పెట్టారని మాజీమంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. డీజీపీ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, తర్వాత ఇబ్బందులు పడతారని అన్నారు. వైసీపీ వాళ్లపై అసభ్యకరంగా పోస్టులు పెడితే తమకు ఆనందంగా ఉందా? అని అడిగారు. విడుదల రజిని ఫిర్యాదుపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. గుర్తుపెట్టుకోండి కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని హెచ్చరించారు.