NRML: ఆర్ధిక, సామాజిక, విద్య, ఉపాధి, కుల వివరాల సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జరిపిస్తున్న ఇంటింటి కుటుంబ సర్వేకు ప్రజలు తమవంతు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ కోరారు. బుధవారం మామడ మండలం న్యూ సాంగ్వి గ్రామంలో నిర్వహిస్తున్న సర్వేను వారు పరిశీలించి అధికారులకు, ప్రజలకు సూచనలు చేశారు. ప్రజలు ఎన్యుమరేటర్లకు సహకరించాలని కోరారు.