TG: బీజేపీ నేతల మాటలకు మాజీ ఎంపీ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీది ఏ కులం, ఏ మతం అని బీజేపీ నేతలు అంటున్నారని.. రాహుల్ గాంధీది బ్రాహ్మణ కుటుంబమని మాజీ ఎంపీ వీ హనుమంతరావు అన్నారు. రాహుల్ గాంధీ కులగణన చేసి దేశంలోని అన్ని కులాలకు న్యాయం చేయాలని చూస్తుంటే.. ప్రధాని మోదీ మాత్రం కులాల మధ్య రాహుల్ గాంధీ చిచ్చు పెట్టాలని చూస్తున్నారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న కులగణన దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు.