అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయంపై చైనా స్పందించింది. అమెరికా ప్రజల నిర్ణయాన్ని గౌరవిస్తామని ఆ దేశం వెల్లడించింది. అమెరికాతో శాంతియుత సంబంధాలు కొనసాగిస్తామని ఆశాభావం వ్యక్తం చేసింది. పరస్పర గౌరవం, సహకారంతో ముందుకెళ్తామని ప్రకటించింది. అయితే ట్రంప్ పేరు నేరుగా ప్రస్తావించకుండా.. ఎన్నికల ఫలితాలపై చైనా స్పందించడం చర్చనీయాంశమైంది.