AP: ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుకు హైకోర్టులో ఊరట లభించింది. ఎమ్మెల్సీగా రఘురాజు సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో శాసనమండలి ఛైర్మన్ అనర్హత వేటు వేశారు. రఘురాజు వాదన వినకుండా అనర్హత వేటు వేయడమేంటని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారాన్ని ధర్మాసనం తిరిగి మండలి ఛైర్మన్ దగ్గరకు పంపింది. కాగా, 2027 నవంబర్ 31 వరకు రఘురాజు ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు.