TG: ఫార్ములా-ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ACB దూకుడుగా వ్యవహరిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా-ఈ రేసింగ్ అక్రమాలపై విచారిస్తోంది. రెండు రోజుల్లో కేసు నమోదు చేసి నోటీసులు ఇచ్చి విచారించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి రూ.55 కోట్లు విదేశీ సంస్థలకు చెల్లించినట్లు గుర్తించింది. మున్సిపల్ శాఖ వద్ద ఉన్న రికార్డుల ఆధారంగా ఆయా విదేశీ సంస్థలు, ప్రతినిధులకు, గత ప్రభుత్వ పెద్దలకు కూడా నోటీసులు జారీ చేయనుంది.