TG: పథకం ప్రకారమే మాజీమంత్రి KTR రియల్ ఎస్టేట్ మీటింగ్ పెట్టారని టీపీసీసీ మీడియా కమిటీ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి అన్నారు. అది గత సంవత్సరం పుట్టిన రియల్ ఎస్టేట్ సంఘం అని.. గతేడాదితో పోలిస్తే ఈసారి రిజిస్ట్రేషన్లు పెరిగాయని తెలిపారు. తెలంగాణకు కాపలా కుక్కలా ఉంటానన్న కేసీఆర్ తెలంగాణను దోచుకున్నారన్నారు. KTR పాదయాత్ర కాదు, మోకాళ్ల యాత్ర చేసినా ప్రజలు నమ్మరంటూ ఎద్దేవా చేశారు.