TG: గత ప్రభుత్వ పాలకులు పదేళ్లు పాలించి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. ‘బంగారు తెలంగాణ సంగతి దేవుడెరుగు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ప్రజలను స్వేచ్ఛగా బతకలేని పరిస్థితికి తీసుకొచ్చారు. ఫ్యూడల్ వ్యవస్థను పునర్ నిర్మాణం చేయడం కోసమే గత పాలకులు పనిచేశారు. ఇప్పుడు వాళ్లు నీతులు చెబితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుంది’ అని ఎద్దేవా చేశారు.