ATP: నగరంలోని చెరువు కట్ట సమీపంలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయంలోని గురు స్వామిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి గాయపరిచారు. ఈ నేపథ్యంలో ఆలయం ఎదుట గురుస్వామితోపాటు ఆలయ భక్తాదులు ఆలయం ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి ఆరా తీశారు. ఈ ఘటనపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.