AP: విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ధర్నా చేపట్టింది. ఈ కార్యక్రమంలో ఏపీసీసీ చీఫ్ షర్మిల పాల్గొని మాట్లాడారు. ‘చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 5నెలల్లోనే ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు హైఓల్టోజ్ షాక్. రూ.6వేల కోట్ల భారం వేయటానికి సిద్ధమయ్యారు. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమన్నారు. YCP, TDP దొందూ దొందే. ప్రజావ్యతిరేక నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు.