అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ వాచ్ పార్టీలో కమలా హారిస్ తన ప్రసంగాన్ని రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు. రేపు మాట్లాడతారని ఆమె ప్రచార బృంద సభ్యుడు సెడ్రిక్ రిచ్మండ్ వెల్లడించారు. అయితే, అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ, మెజార్టీ మార్క్‌కు చేరువయ్యారు. దీంతో హారిస్ ప్రసంగాన్ని రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.