TG: మాదాపూర్ మెడికోవర్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. అనారోగ్యంతో జూ.డాక్టర్ నాగప్రియ చికిత్స పొందుతూ మరణించింది. అయితే బిల్లు కడితేనే ట్రీట్మెంట్ కొనసాగిస్తామని కుటుంబసభ్యులకు వైద్యులు తెలిపారు. అప్పటికే రూ.3 లక్షలకుపైగా డబ్బు కట్టగా.. ఈరోజు ఉదయం రూ.లక్ష చెల్లించిన తర్వాత నాగప్రియ చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. దీంతో డబ్బుల కోసమే మరణవార్తను దాచిపెట్టారంటూ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.