అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతోన్న వేళ డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నారు. తాజాగా దీనిపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. గేమ్ సెట్ అండ్ మ్యాచ్ అంటూ ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు. ట్రంప్ గెలిస్తే ఫెడరల్ ఏజెన్సీల సంఖ్య తగ్గించాలని సూచిస్తానని చెప్పారు. కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌నకు మస్క్ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.