టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. ఈ ముద్దుగుమ్మ తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానాలు ఇస్తుంటారు. తాజాగా ఓ నెటిజన్ ‘నిన్ను చూస్తే గర్వంగా ఉంటుంది. నీకు తోడు ఎవరూ లేకపోతే నీతో పాటు నేను ఉంటా.. ఐ లవ్ యూ సమంత’ అని కామెంట్ పెట్టాడు. దీనిపై సమంత స్పందిస్తూ.. ‘నీ ప్రేమే నాకు బలం’ అని సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.