AP: వైసీపీ శ్రేణుల దుష్ప్రచారాలపై x వేదికగా హోంమంత్రి అనిత పోస్ట్ చేశారు. తిరుపతిలో టెన్త్ బాలికపై జరిగిన దాడిని లైంగిక దాడి అంటూ విషం కక్కుతున్న YCP నేతలు మనుషులేనా? అని మండిపడ్డారు. బాలిక, తల్లిదండ్రుల మానసిక క్షోభను లెక్క చేయకుండా హద్దు మీరి ప్రవర్తిస్తారా? అంటూ నిలదీశారు. అదే తమ ఇంటి ఆడపడుచులకు జరిగితే ఈ విధంగానే స్పందిస్తారా? అని ప్రశ్నించారు. పోలీసులు, వైద్యులు నిర్ధారించి చెప్పినా దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.