అమెరికా ఎన్నికల వేళ గూగుల్ ఉద్యోగులకు సీఈవో సుందర్ పిచాయ్ కీలక మెయిల్ చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిచినా.. అన్ని వర్గాల ప్రజలకు విశ్వసనీయ సమాచార కేంద్రంగా గూగుల్ ఉండాలని సూచించింది. ఎన్నికల ఫలితాల వేళ రాజకీయ విమర్శలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో గూగుల్ సీఈవో వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో గూగుల్‌పై డొనాల్డ్ ట్రంప్ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.