CTR: టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించి ఈనెల 10వ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు బూత్, యూనిట్, క్లస్టర్ల వారీగా సీఎం చంద్రబాబు నాయుడు టెలి కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ చేస్తారని టీడీపీ కుప్పం ఇంఛార్జ్ మునిరత్నం, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పేర్కొన్నారు. నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని టీడీపీ శ్రేణులు మరింత వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.