TG: కేసీఆర్ కృషి వల్ల రాష్ట్రంలో భూముల ధరలు పెరిగాయని మాజీమంత్రి కేటీఆర్ అన్నారు. ‘ఉమ్మడి ఏపీలో రైతులకు మేలు చేయాలని పాలకులు ఆలోచించలేదు. మా తాతకు 400 ఎకరాల ఆస్తి ఉండేది. అన్ని ఎకరాలున్నా నీళ్లు లేకపోయేసరికి ధరలు చాలా తక్కువ ఉండేవి. 2014కు ముందు రాష్ట్రంలో భూముల ధరలు చాలా తక్కువ ఉండేవి. కేసీఆర్ నాయకత్వంలో సాగునీటి సదుపాయాలు మెరుగయ్యాయి’ అని పేర్కొన్నారు.