TG: ఇంటర్ పరీక్ష ఫీజులను ఈనెల 6 నుంచి 26 వరకు చెల్లించాలని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. రూ.100 ఆలస్య రుసుముతో 27 నుంచి డిసెంబర్ 4 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 5 నుంచి 11 వరకు, రూ.1000 డిసెంబర్ 12 నుంచి 18 వరకు, రూ.2 వేలతో డిసెంబర్ 19 నుంచి 27 వరకు చెల్లించే అవకాశం కల్పించారు. ఫస్టియర్ జనరల్ రూ.520, వొకేషనల్ రూ.750, సెకండియర్ జనరల్ రూ.520, సైన్స్, వొకేషనల్ కోర్సులకు రూ.750గా ఫీజు నిర్ధారించారు.