AP: రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో పోలీసుల పాత్ర అత్యంత కీలకమని హోంమంత్రి అనిత అన్నారు. చిన్నారులపై అఘాయిత్యాలు, మహిళలపై దాడులు చాలా చూస్తున్నామని.. గంజాయి మత్తులో అనేక అక్రమాలు చేస్తున్నారని గుర్తుచేశారు. కఠోర శిక్షణ పొందిన పోలీసులు.. ప్రజల మాన ప్రాణాలకు రక్షణగా ఉండాలని సూచించారు. పోలీసుల ముందు అనేక సవాళ్లున్నాయని.. ధైర్యంగా ఎదుర్కోవాలని పేర్కొన్నారు. వారు నిజాయతీగా పనిచేసి ప్రజారక్షణకు బాధ్యత వహించాలని కోరారు.