తమిళనాడులోని మీంజూర్ రైల్వేస్టేషన్ పరిధిలో మృతదేహం కలకలం రేపింది. నెల్లూరులో మహిళను హత్య చేసిన తండ్రీ, కూతురు మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పెట్టి రైలు నుంచి బయటకు విసిరారు. నెల్లూరు నుంచి చెన్నై వెళ్లే సబర్బన్ రైలు నుంచి సూట్‌కేస్ విసిరేస్తుండగా రైల్వే పోలీస్ గమనించారు. దాన్ని తెరచి చూడగా.. లోపల డెడ్‌బాడీ ఉంది. దీంతో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు.