SRCL : రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పత్తిని సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని పత్తి రైతులు ఆర్థికంగా బలపడాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆకాంక్షించారు. వేములవాడ అర్బన్ మండలం నాంపల్లి, సంకేపల్లి, కోనరావు పేట మండలం సుద్దాలలో ఏర్పాటు చేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.