AP: గత ప్రభుత్వం రాజధానితో మూడు ముక్కలాట ఆడిందని మంత్రి నారాయణ మండిపడ్డారు. మంత్రులు, జడ్జిలు, ఇతర బంగ్లాలకు రూ.41 వేల కోట్ల టెండర్లు వచ్చాయన్నారు. రూ.30 వేల కోట్ల టెండర్లకు సంబంధించి పనులు మొదలయ్యాయని అన్నారు. 2014-19 సమయంలో టెండర్ ఇచ్చిన పనుల గడువు ముగిసిందని చెప్పారు. పనులకు సంబంధించి చీఫ్ ఇంజనీర్ల కమిటీ అక్టోబర్ 29న నివేదిక ఇచ్చిందని పేర్కొన్నారు. డిసెంబర్ చివరిలోగా అన్ని టెండర్లు పిలవాలని ఆదేశించామన్నారు.