AP: హోంమంత్రి అనిత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం VIP దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రంగనాయకుల మండపంలో మంత్రికి పండితులు వేదాశీర్వచనం చేసి, తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన అనిత.. సీఎం చంద్రబాబు, పవన్, కూటమి నేతలు బాగుండాలని ప్రార్థించినట్లు వెల్లడించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ప్రజలు బాగుండాలని కోరుకున్నట్లు చెప్పారు.