SRPT: తిరుమలగిరి మండలంలోని పలు గ్రామాల తాజా మాజీ సర్పంచులను సోమవారం ఛలో హైదరాబాద్ శాంతియుత నిరసనకు వెళ్తుండగా పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పలువురు తాజా మాజీ సర్పంచులు మాట్లాడుతూ.. తమ హయాంలో ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, అప్పులు తెచ్చి గ్రామపంచాయతీలో పనులు చేశామని, అరెస్టులను ఖండిస్తున్నామన్నారు.