VZM: విజయనగరం 44వ డివిజన్ అయ్యన్నపేటకు చెందిన కర్రోతు వెంకటరమణ ఇటీవల అనారోగ్యంతో శస్త్ర చికిత్స చేయించుకున్నారు. వారి ఆర్ధిక పరిస్థితి బాగోలేనందున వీరి తరపున ఎమ్మెల్యే అదితిగజపతి రాజు సీఎం సహాయనిధికి దరఖాస్తు చేశారు. స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు రూ.2,52,424లు మంజూరు చేస్తూ చెక్కును పంపించారు. శనివారం ఎమ్మెల్యే ఆ చెక్కును అతనికి అందజేశారు.